News3rd Sep 05:15 PMSunil Byrisetty1 min read
మొక్కలు నాటడం కార్యక్రమం కాదు.. బాధ్యత!
వాతావరణ సమతుల్యతను పరిరక్షించడంతో పాటు జీవవైవిధ్యం, జీవరాశుల మనుగడను కాపాడుకోవడానికి విస్తృత స్థాయిలో పచ్చదనాన్ని పెంపొందించడం అత్యంత అవసరమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్
వాతావరణ సమతుల్యతను పరిరక్షించడంతో పాటు జీవవైవిధ్యం, జీవరాశుల మనుగడను కాపాడుకోవడానికి విస్తృత స్థాయిలో పచ్చదనాన్ని పెంపొందించడం అత్యంత అవసరమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు పేర్కొన్నారు. మొక్కలు నాటడం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, భావి తరాల భవిష్యత్తును కాపాడే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో పూర్తయ్యే కార్యక్రమం కాదని, రాబోయే తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో, నిరంతర కృషితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా సూర్యలంకలో సముద్రపు కోతను అరికట్టడానికి విద్యార్థులతో కలిసి తాటి చెట్లను నాటారు. 20 ఏళ్ల క్రితం నాటిన తాటి చెట్లు ప్రస్తుతం సహజ రక్షణ గోడలా మారి తీరాన్ని కాపాడుతున్న తీరును ఆయన పరిశీలించారు. పర్యటనలో భాగంగా ఆయన బ్యాక్ వాటర్స్‌లో బీచ్ స్కూటర్లపై వెళ్లి మడ అడవులను స్వయంగా వీక్షించారు.