News3rd Sep 12:02 PMSunil Byrisetty1 min read

గిరిజనుల ప్రాణాలతో చెలగాటం!

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల మలేరియా మందులు వికటించి ఒక చిన్నారి మృతి చెందడం, పదుల సంఖ్యలో గిరిజన పిల్లలు అస్వస్థతకు గురికావడం అత్యంత ఆందోళనక

గిరిజనుల ప్రాణాలతో చెలగాటం!
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల మలేరియా మందులు వికటించి ఒక చిన్నారి మృతి చెందడం, పదుల సంఖ్యలో గిరిజన పిల్లలు అస్వస్థతకు గురికావడం అత్యంత ఆందోళనకరమని సీపీఎం పేర్కొంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్యేనని ఆరోపించింది. గిరిజన ప్రాంతాల్లో ‘గిరిజన సంజీవని’ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వ డొల్లతనం ఈ ఘటనతో బట్టబయలైందని మండిపడింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు గిరిజనుల రక్షణ గురించి మాట్లాడతారే కానీ, కనీస వైద్య సేవలు అందక గిరిజనులు పిట్టల్లా రాలిపోతుంటే ఏం సమాధానం చెబుతారని నిలదీసింది. అసలు గిరిజనులకు ఇచ్చిన క్లోరోక్విన్ మందుల బ్యాచ్ ఎక్స్‌పైరీ తేదీ 2028 అని అధికారులు చెబుతున్నప్పటికీ, ఏ పద్ధతిలో పరీక్షలు చేయకుండా గ్రామంలోని 52 మందికి ఒకేసారి ట్యాబ్లెట్లు వేశారని ప్రశ్నించారు. దీనికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులు బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Polavaram
Etapaka
Gollaguppa
Tribal People
Tribal Health
Chloroquine Tablets
Malaria Medicine
Child Death
CPM
CPI(M)
V Srinivasa Rao
గిరిజన ప్రాంతాలు
వైద్య సేవలు
ప్రభుత్వ నిర్లక్ష్యం
మలేరియా
ఏపీ రాజకీయాలు
పోలవరం వార్తలు
Scroll for the next article