News8th Jul 12:19 PMSunil Byrisetty1 min read

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‍తో అచ్చెన్న భేటీ

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‍ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. మామిడి రైతు

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‍తో అచ్చెన్న భేటీ
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‍ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించి, తొతాపురి మామిడి ధర తగ్గడంతో రైతులకు నష్టం వాటిల్లుతోందని వివరించారు. ధర రూ.8కి పడిపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ధరల లోటు చెల్లింపు పథకం కింద మద్దతు ధరగా రూ.12 నిర్ణయించినట్లు వివరించడంతోపాటు, 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తొతాపురి కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.260 కోట్లు ఖర్చు చేస్తుందని.. కేంద్ర భాగస్వామ్యం కూడా అందించాలని కోరారు. మంత్రి అచ్చెన్నాయుడు విన‌తుల ప‌ట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Andhra Pradesh news
Delhi
Minister Atchannaidu
Shivraj Singh Chouhan
agriculture sector development
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కేంద్రం నుంచి సహకారం కావాలని కోరారు
Scroll for the next article