News3rd Oct 12:44 PMSunil Byrisetty1 min read
పీఎం మెమెంటోస్ వేలం గడువు పొడిగింపు
ప్రధాని నరేంద్ర మోదీకి లభించిన బహుమతులు, జ్ఞాపికల విక్రయానికి సంబంధించిన ‘పీఎం మెమెంటోస్’ 8వ విడత వేలం గడువును ఈనెల 31వ తేదీ వరకు కేంద్రం పొడిగించింది. ఈ ఆన్‌లైన్ వేలంలో 30 రకాల జ
ప్రధాని నరేంద్ర మోదీకి లభించిన బహుమతులు, జ్ఞాపికల విక్రయానికి సంబంధించిన ‘పీఎం మెమెంటోస్’ 8వ విడత వేలం గడువును ఈనెల 31వ తేదీ వరకు కేంద్రం పొడిగించింది. ఈ ఆన్‌లైన్ వేలంలో 30 రకాల జ్ఞాపికలు, కానుకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కాకతీయ కళాతోరణం వెండి నమూనా కూడా ఉంది, దీని ప్రాథమిక ధర రూ.10 లక్షలుగా ప్రకటించారు. అత్యధికంగా జగన్నాథ పరివార రథం ప్రతిమకు రూ.21 లక్షల బేస్ ప్రైస్ ఉంది. వేలం ఆదాయాన్ని ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు విరాళంగా అందించనున్నారు. అయితే పీఎం మెమెంటోస్ కోసం దేశవ్యాప్తంగా క్రేజ్ కనిపిస్తోంది.