News21st Jul 11:19 AMSunil Byrisetty1 min read
ఈ వర్షాలతో వ్యవసాయానికి ఊతం
ఈసారి కురిసిన వర్షాలు వ్యవసాయానికి ఊతం ఇస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలన
ఈసారి కురిసిన వర్షాలు వ్యవసాయానికి ఊతం ఇస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
యాక్సియం-4 మిషన్పై మోడీ ప్రశంసలు.. అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించామని వివరించారు.
భారత సైనిక పాటవాలను ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూసాయని చెప్పారు. ఆపరేషన్ సిందూర్తో వంద శాతం లక్ష్యాలను ఛేదించామన్నారు. ఆపరేషన్ సిందూర్తో మన సత్తా ప్రపంచానికి తెలిసిందని వెల్లడించారు. తక్కువ సమయంలోనే మన ఆర్మీ టార్గెట్ను కొట్టి చూపించిందని ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.