National11th Oct 04:27 PMSunil Byrisetty1 min read
చెన్నైకి ప్రధాని మోదీ.. దళపతి స్వాగతం!
చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ ఘన స్వాగతం పలికారు. తమిళనాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై చేరుకున్నారు. విమాన
చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ ఘన స్వాగతం పలికారు. తమిళనాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, సీఎం విజయ్‌తో పాటు అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి, బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి పొరూర్ మెట్రో స్టేషన్ వరకు ప్రధాని రోడ్ షో నిర్వహించారు. అనంతరం సీఎం విజయ్ తో కలిసి పూనమల్లి - వడపళని మధ్య నూతనంగా నిర్మించిన చెన్నై మెట్రో ఫేజ్-2 ను ప్రారంభించి, ఇద్దరూ కలిసి మెట్రోలో ప్రయాణించారు. ఈ ప్రాజెక్టుల విలువ దాదాపు రూ.13,000 కోట్లుగా ఉంది.