National9th Sep 10:46 AMSunil Byrisetty1 min read
నేడు మోడీ సుడిగాలి పర్యటనలు..
ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉదయం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేశారు. అక్కడి నుంచి హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని రెండ
ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉదయం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేశారు. అక్కడి నుంచి హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని రెండు రాష్ట్రాల్లో సహాయ శిబిరాలను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ఈ రెండు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడి పదుల కొద్ది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. అనంతరం వరద బాధితులతో సంభాషించనున్నారు. అలాగే ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, ఆప్దా మిత్ర బృందాలను కలవనున్నారు. అనంతరం రాష్ట్రంలో అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.