News19th Jul 10:30 AMSunil Byrisetty1 min read

త్యాగధనులకు మోదీ ఆహ్వానం

ప్రధానమంత్రి పక్కన కూర్చున్నవారు పూణేకు చెందిన యోగేష్ సిద్ధార్థ, అతని భార్య సుమిత సిద్ధార్థ. వారిని అభినందించడానికి ప్రధానమంత్రి మోదీ తన ఇంటికి ఆహ్వానించారు. ప్రధానమంత్రి వారిని తన

త్యాగధనులకు మోదీ ఆహ్వానం
ప్రధానమంత్రి పక్కన కూర్చున్నవారు పూణేకు చెందిన యోగేష్ సిద్ధార్థ, అతని భార్య సుమిత సిద్ధార్థ. వారిని అభినందించడానికి ప్రధానమంత్రి మోదీ తన ఇంటికి ఆహ్వానించారు. ప్రధానమంత్రి వారిని తన ఇంటికి ఆహ్వానించడానికి వారు ఏమి చేసారో చూద్దాం. యోగేష్ సిద్ధార్థ రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి. సియాచిన్ హిమానీనదంలో ఉన్న మన సైనికులు అప్పుడప్పుడు ఆక్సిజన్ కొరతతో బాధపడుతుంటారు. దీనికి పరిష్కారం కనుగొనాలని కోరుకుంటూ, యోగేష్ సిద్ధార్థ తన పొదుపు మొత్తాన్ని, తన ఇంట్లోని అన్ని ఆభరణాలను అమ్మేసి, ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్‌లో మొత్తం ₹ 1.25 కోట్లతో ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాన్ని స్థాపించారు. ఫలితంగా, అక్కడ పనిచేసే సైనికులకు ఆక్సిజన్ కొరత కనుమరుగైంది, ఇప్పుడు మన 20,000 మంది సైనికులకు అవసరమైన ఆక్సిజన్ నిరంతరం అందుతోంది. సమస్యల గురించి మాట్లాడేవారు, ఎత్తి చూపేవారు చాలా మంది ఉంటాము. సమస్యలను పరిష్కరించేవారు చాలా అరుదుగా ఉంటారు. అరుదైన ఈ పని చేసి కూడా ప్రచారం వద్దనుకున్న యోగేష్ సిద్ధార్థ, సుమీత సిద్ధార్థ ఇద్దరూ ప్రశంసలకు అర్హులు.
India news
PMModi Siachen
India army
Oxygen plant
Pune couple
Yogesh siddharth
Sumita Siddharth
Siachen Soldiers
ఆక్సిజన్‌ ప్లాంట్
సుమిత్‌ సిద్ధార్థ్
Scroll for the next article