News2nd Oct 09:57 AMSunil Byrisetty1 min read

RSSకు వందేళ్లు.. ఏం చేసింది ?

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ ఏర్పడి వందేళ్లు అయిందని సంబరాలు చేస్తున్నారు. ఈ అంశంపై రెండు విధాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ సంస్థ దేశానికి ఏం చేయలేదని కొంత మంది.. దేశాన్ని కాపాడుతోంద

RSSకు వందేళ్లు.. ఏం చేసింది ?
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ ఏర్పడి వందేళ్లు అయిందని సంబరాలు చేస్తున్నారు. ఈ అంశంపై రెండు విధాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ సంస్థ దేశానికి ఏం చేయలేదని కొంత మంది.. దేశాన్ని కాపాడుతోందని మరికొంత మంది చెబుతున్నారు. అయితే చరిత్రలో ఆరెస్సెస్ గురించి వ్యతిరేక ప్రచారమే ఎక్కువ జరిగింది. ఎంత జరిగినా ఆ సంస్థ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను 1925 దసరా రోజున కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రారంభించారు. దీన్ని స్వాతంత్ర్య ఉద్యమం కోసం ప్రారంభించలేదు. స్వాతంత్ర్య పోరాటం తమ లక్ష్యం అని చెప్పలేదు. హిందూ సంస్కృతి, జాతీయవాదం, సేవా ఆధారిత స్వయంసేవకుల సంఘంగా ఏర్పాటు అయింది. అయితే చాలా మంది దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆరెస్సెస్ పాత్ర లేదని చెబుతూ ఉంటారు. కానీ హిందూత్వమే లక్ష్యంగా ఏర్పడిన సంస్థ అదే లక్ష్యం కోసం నిరంతరం పని చేస్తోంది.
Indian History
RSS
Rashtriya Swayam sevak Sangh
100 Years Of RSS
Hindutva
Nationalism
HinduCulture
RSS Centenary
Social Organization
భారత చరిత్ర
జాతీయ వాదం
హిందూ సంస్కృతి
Scroll for the next article