International21st Aug 08:57 AMSunil Byrisetty1 min read
ప్రధాని మోదీతో చైనా మంత్రి భేటీ
భారత ప్రధాని నరేంద్ర మోదీతో చైనా విదేశాంగ మంత్రి భేటీ అయ్యారు. భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు దిశగా కీలక ముందడుగు పడింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇరు దేశాల మధ్య
భారత ప్రధాని నరేంద్ర మోదీతో చైనా విదేశాంగ మంత్రి భేటీ అయ్యారు. భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు దిశగా కీలక ముందడుగు పడింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వివాదాస్పద అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవడంపై ఈ భేటీలో ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆహ్వానం మేరకు వాంగ్ యీ
భారత్ కు వచ్చారు. తొలుత భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రేర్ ఎర్త్స్, ఎరువులు, టన్నెల్-బోరింగ్ యంత్రాలకు సంబంధించి భారత్ వ్యక్తం చేసిన మూడు ప్రధాన ఆందోళనలపై సానుకూలంగా స్పందిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాంజిన్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంపైనా చర్చించారు.