International11th Sep 04:21 PMSunil Byrisetty1 min read
పుతిన్'తో మోదీ సమావేశం.. అజెండా ఇదే!
భారత మండపం వేదికగా ప్రధాని 'నరేంద్ర మోదీ-పుతిన్' సమావేశమయ్యారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఇరువురు నేతల ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ
భారత మండపం వేదికగా ప్రధాని 'నరేంద్ర మోదీ-పుతిన్' సమావేశమయ్యారు.
బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఇరువురు నేతల ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేరుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు గతంలో మాదిరిగా కొనసాగే అంశంపై చర్చ జరిగింది. న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణంలో సహకారం మరింత పెంపొందించడంపై చర్చించారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.