News21st Oct 10:28 AMSunil Byrisetty1 min read
రామబాణం గురిపెట్టిన ప్రధాని మోదీ
ఢిల్లీలో విజయదశమి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. శ్రీ రామలీలా కమిటీ ఇందప్రస్థ నిర్వహించిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరాముడు, సీతమ్మ, హనుమంతుడికి నమస్కరించి దేశ ప
ఢిల్లీలో విజయదశమి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. శ్రీ రామలీలా కమిటీ ఇందప్రస్థ నిర్వహించిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరాముడు, సీతమ్మ, హనుమంతుడికి నమస్కరించి దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ సంప్రదాయబద్ధంగా బాణం సంధించి రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మల దహనంతో అక్కడి వాతావరణం సందడిగా మారింది. విజయదశమి చెడుపై మంచి, అసత్యంపై సత్యం, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికీ సత్యం, ధర్మం, కరుణ, ప్రేమ, సోదరభావం వంటి విలువలను నేర్పుతుందని అన్నారు. రామరాజ్యం అంటే వివక్షకు తావులేని పాలన, న్యాయానికి ప్రాధాన్యం, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే వ్యవస్థ అని వివరించారు. అధికారంలో ఉండటం అంటే ప్రజలను పాలించడం మాత్రమే కాదని, ప్రజలకు సేవ చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.