News21st Jun 12:33 PMSunil Byrisetty1 min read

లోకేష్‌ను పదేపదే మెచ్చుకున్న మోదీ

విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ చూపిన చొరవ, కృషిని ప్ర

లోకేష్‌ను పదేపదే మెచ్చుకున్న మోదీ
విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ చూపిన చొరవ, కృషిని ప్రత్యేకంగా అభినందించారు. యోగా దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను గత నెల రోజులుగా మంత్రి లోకేశ్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. యోగాను కేవలం వ్యాయామంగా మాత్రమే కాకుండా, ఒక సామాజిక వేడుకగా ఎలా నిర్వహించవచ్చో లోకేశ్ చేసి చూపించారని కొనియాడారు. 'యోగాంధ్ర' పేరిట చేపట్టిన కార్యక్రమాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో లోకేశ్ సఫలీకృతులయ్యారని ప్రధాని మోదీ ప్రశంసించారు. విశాఖలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Andhra Pradesh news
Visakhapatnam
yoga day
Nara lokesh
Pm Modi
విశాఖలో యోగాంధ్ర
మంత్రి లోకేశ్ పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు
Scroll for the next article