News2nd Aug 04:13 PMSunil Byrisetty1 min read
.రైతు సేవలో బీజేపీ: ఏపీ చీఫ్ మాధవ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత మొత్తాన్ని విడుదల చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. రైతాంగానిక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత మొత్తాన్ని విడుదల చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. రైతాంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,000 కోట్లు బదిలీ అయ్యాయని తెలిపారు. పథకం ద్వారా రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6,000 ఆర్థిక సాయం అందుతుందన్నారు. అంటే, ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయని వివరించారు. అంతకుముందు, జూన్ 18, 2024న, ప్రధానమంత్రి మోదీ నుంచి రూ.9.26 కోట్ల మంది రైతుల ఖాతాలకు సమ్మాన్ నిధిని రిలీజ్ చేశారని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా పంటకు నష్టం జరిగితే బీమా సంస్థ పరిహారం ఇస్తుందని మాధవ్ గుర్తు చేశారు. ఈ స్కీం ద్వారా ఇప్పటివరకు రైతులకు రూ.1.75 లక్షల కోట్లకు పైగా విలువైన క్లెయిమ్‌లు ఇచ్చినట్లు మాధవ్ గుర్తు చేశారు.