National23rd Jul 09:45 AMSunil Byrisetty1 min read
పేపర్ లీక్ పై ప్రధాని మోదీ సీరియస్
నీట్ పేపర్ లీకుపై ఎట్టకేలకు ప్రధాని మోదీ స్పందించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ముట్డడి పిలుపు తర్వాత ప్రధానిలో చలనం వచ్చింది. కొనసాగుతున్న ఆందోళనల వే
నీట్ పేపర్ లీకుపై ఎట్టకేలకు ప్రధాని మోదీ స్పందించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ముట్డడి పిలుపు తర్వాత ప్రధానిలో చలనం వచ్చింది. కొనసాగుతున్న
ఆందోళనల వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. “విద్యార్థుల సంక్షేమం కంటే ఏదీ ముఖ్యం కాదు. పేపర్ లీక్లో దోషులకు శిక్ష పడేలా చేసేందుకు ఫాస్టాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేవారిని వదిలి పెట్టబోం” అని మోదీ స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటన ముందుగా చేసి, ఆందోళనకారులతో చర్చించి ఉంటే బాగుండేదని విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంట్ ముట్టడి సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్న తర్వాత ఇప్పటికైనా స్పందించారని అభిప్రాయపడ్డారు. అయితే నీట్ పేపర్ లీకై, మళ్లీ నీట్ నిర్వహించి, ఫలితాలు విడుదలయ్యాక ప్రధాని స్పందించడం విశేషం.