News21st Jun 09:02 AMSunil Byrisetty1 min read
నూనె తగ్గించండి.. ఊబకాయాన్ని దూరం పెట్టండి!
ప్రపంచానికి యోగా నేర్పింది భారతదేశమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన 28 కిలోమీటర్ల యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రపంచానికి యోగా నేర్పింది భారతదేశమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన 28 కిలోమీటర్ల యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో భారతదేశం వైద్యచికిత్సలకు పేరు పొందుతోందని, యోగా సర్టిఫికేషన్ కోసం ఏడున్నర లక్షల మందికిపైగా వాలంటీర్లు నమోదయ్యారని పేర్కొన్నారు. 130 సంస్థలు, వైద్య కళాశాలల్లో పది రోజుల యోగా మాడ్యూల్స్ రూపొందించారన్నారు. దేశంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో శిక్షణ పొందిన యోగా ఉపాధ్యాయులు బోధిస్తున్నారని తెలిపారు. యోగా దినోత్సవం సందర్భంగా ఊబకాయం గురించి సూచన చేస్తున్నానని, తినే ఆహారంలో 10 శాతం నూనె వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఊబకాయం రాకుండా చూసుకోవాలని సూచించారు.