News19th Apr 08:57 AMSunil Byrisetty1 min read
ఐదు లక్షల మందితో ప్రధాని మోదీ సభ
మే 2న అమరావతిలో పీఎం మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మోదీ సభను 5 లక్షలమందితో సక్సెస్ చేయాలని భావిస్తున
మే 2న అమరావతిలో పీఎం మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మోదీ సభను 5 లక్షలమందితో సక్సెస్ చేయాలని భావిస్తున్నారు.
సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే సభ ప్రధాన వేదిక వద్ద 50,000 కూర్చునే ఏర్పాట్లు చేస్తున్నారు.
దాదాపు లక్ష మంది రోడ్లపై నిలబడి స్వాగతం పలికేలా ప్రణాళిక రచిస్తున్నారు.
9 ప్రధాన రహదారుల ద్వారా ప్రజలు, వీఐపీలకు దారి ఏర్పాటు చేస్తున్నారు.
ప్రధాని సభకు భద్రత కోసం SPG పర్యవేక్షణ చేయనుంది.
మొత్తం 250 ఎకరాల్లో సభా ఏర్పాట్లు చేస్తుండగా.. వేదికల కోసం 28 ఎకరాలు కేటాయించారు.
సభకు వచ్చే ప్రముఖుల కోసం 4 హెలీప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు.
వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్‌ప్రూఫ్ టెంట్లతో ఏప్రిల్ 28 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.