News15th May 11:09 AMSunil Byrisetty1 min read

జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని

జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈవేడుకులకుప్రధాన మంత్రి నరేంద్ర మోడి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై

జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని
జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈవేడుకులకుప్రధాన మంత్రి నరేంద్ర మోడి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి మోడి సూచనలతో 2014 డిసెంబరులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించగా 2015 జూన్ 21వ తేదీన మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోడి చేతుల మీదుగా ప్రారంభించారు. ఒకే వేదికపై 35,985 మంది యోగాసనాలు చేసి రెండు గిన్నిస్ రికార్డులు సాధించడం జరిగింది. ఇప్పటి వరకు 10 అంతర్జాతీయ యోగా దినోత్సవాలు నిర్వహించుకోవడమైంది. మే 2న ప్రధాని అమరావతికి వచ్చినపుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని ఆ వేడుకలకు తాను హాజరవుతానని సభా వేదిక నుండి ప్రకటించారు. అందుకు అనుగుణంగా జూన్ 21న విశాఖలో "Yoga for One Earth,One Health" అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయనుంది.
visakhapatnam
pm modi
international yoga day
విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని
Scroll for the next article