National17th Oct 10:37 AMSunil Byrisetty1 min read

ఈసారి గోవాలో ప్రధాని దీపావళి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించనున్నారు. ఈ ఏడాది గోవా తీరం

ఈసారి గోవాలో ప్రధాని దీపావళి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించనున్నారు. ఈ ఏడాది గోవా తీరంలోని నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ లో భారత్‌ సాధించిన విజయాన్ని నౌకాదళ సిబ్బందితో కలిసి ప్రధాని సెలబ్రేట్‌ చేసుకోనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి మోదీ ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. సైనిక దుస్తులు ధరించి.. దళాలతో ముచ్చటించి.. వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో మోదీ తొలిసారి సియాచిన్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గతేడాది కచ్‌లోని సర్‌ క్రీక్‌ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందిని కలిసి వారితో వేడుకలు చేసుకున్నారు.
Indian Armed Forces
PM Modi
Diwali 2025
Goa
Indian Navy
Operation Sindoor
Modi Tradition
Soldiers with PM
Inspiration
National Pride
మోదీ దీపావళి వేడుకలు
భారత నౌకాదళం గోవా
Scroll for the next article