Telangana22nd May 10:24 AMSunil Byrisetty1 min read
103 రైల్వేస్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం పునరాభివృద్ధి చేసిన 103 రైల్వేస్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం పునరాభివృద్ధి చేసిన 103 రైల్వేస్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రైల్వేస్టేషన్లను సిద్ధం చేశారు.
అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న 103 రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
వీటిలో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి.
ఇందులో బేగంపేట రైల్వేస్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనుండటం విశేషంగా చెప్పవచ్చు.
అలాగే వివిధ రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లు ప్రారంభం కానున్నాయి.