News3rd Mar 11:07 AMSunil Byrisetty1 min read

త్వరలో ఏపీ పర్యటనకు మోదీ?

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్నారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం డి ఆర్ డి ఓ రూ.15-20వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇక్

త్వరలో ఏపీ పర్యటనకు మోదీ?
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్నారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం డి ఆర్ డి ఓ రూ.15-20వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీని పై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కృష్ణా జిల్లాకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు రానుంది.
PM Modi
Andhra Pradesh
Chandra Babu Naidu
ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు నాయుడు
Scroll for the next article