News11th Oct 12:01 PMSunil Byrisetty1 min read
16న ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన ఖరారు
ఈ నెల 16న ఉదయం 7.50 కు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోదీ బయల్దేరి కర్నూలు రానున్నారు. ఉదయం 10.20 కు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. ఉదయం 11.10 కి రోడ్డుమా
ఈ నెల 16న ఉదయం 7.50 కు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోదీ బయల్దేరి కర్నూలు రానున్నారు. ఉదయం 10.20 కు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. ఉదయం 11.10 కి రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. ఉదయం 11.45 కి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1.40 కి సుండిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 కు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.15 కు రోడ్డుమార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకొని సాయంత్రం 4.40 కు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని దిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.