National8th Nov 04:00 PMSunil Byrisetty1 min read

బస్తర్‌లో జవాన్లతో మోదీ దీపావళి

మావోయిస్టుల కంచుకోటగా పేరున్న బస్తరులో ప్రధాని పర్యటన సంచలనం సృష్టిస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు నాయకులు సంకోచిస్తారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చేర

బస్తర్‌లో జవాన్లతో మోదీ దీపావళి
మావోయిస్టుల కంచుకోటగా పేరున్న బస్తరులో ప్రధాని పర్యటన సంచలనం సృష్టిస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు నాయకులు సంకోచిస్తారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నక్సలిజంపై పోరాటంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాల సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నక్సలిజం నిర్మూలన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న భద్రతా సిబ్బందికి ప్రధాని సంఘీభావం తెలిపారు. ఒకప్పుడు నక్సలిజానికి కేంద్రంగా ఉన్న బస్తర్ ప్రాంతం ఇప్పుడు నక్సలిజం నుంచి విముక్తి పొందిందని పేర్కొన్నారు.
Scroll for the next article