News11th Oct 11:28 AMSunil Byrisetty1 min read
విజయవాడ ఉత్సవ్.. ప్రధాని లేఖ
విజయవాడ ఉత్సవ్ 2.0 గురించి ప్రధాని మోదీ లేఖ రాశారు. ఏపీలో విజయవాడ ఉత్సవ్ నిర్వహణ సంతోషకరమన్నారు. విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్న ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఏపీ ఆ
విజయవాడ ఉత్సవ్ 2.0 గురించి ప్రధాని మోదీ లేఖ రాశారు. ఏపీలో విజయవాడ ఉత్సవ్ నిర్వహణ సంతోషకరమన్నారు. విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్న ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఏపీ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్.. పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గాలు తెరుస్తుందని అభిలాషించారు. పర్యాటక రంగానికి కూడా కొత్త ఉత్తేజాన్ని అందిస్తుందని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.