International8th Aug 09:06 AMSunil Byrisetty1 min read
రాజీనా.. ట్రంప్ అయితే ఇక్కడ మోదీ!
రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై సుంకాలను రెట్టింపు చేశారు. 25 శాతం ఉన్న సుంకాలను 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇలాంటి బె
రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై సుంకాలను రెట్టింపు చేశారు. 25 శాతం ఉన్న సుంకాలను 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇలాంటి బెదిరింపులకు భారత ప్రధాని మోదీ తగ్గేదే లేదంటున్నారు. రైతుల ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదంటూ దీటుగా బదులిచ్చారు.
రైతుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోమన్నారు. సుంకాల పెంపుతో భారీ మూల్యం తప్పదని తెలుసు, అయినా రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వెనకడుగు వేయమని స్పష్టం చేశారు. పెరిగిన టారిఫ్‌లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. ముఖ్యంగా రొయ్యలు, జంతు సంబంధ ఉత్పత్తులపై అదనపు భారం పడింది.