News1st May 10:42 AMSunil Byrisetty1 min read

విశాఖలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్‌!

విశాఖకు మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది. దేశవ్యాప్తంగా చేనేత, హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన యూనిటీ మాల్‌ను విశాఖలోని మధురవాడలో నిర్మించనున్నారు. రూ.172 క

విశాఖలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్‌!
విశాఖకు మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది. దేశవ్యాప్తంగా చేనేత, హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన యూనిటీ మాల్‌ను విశాఖలోని మధురవాడలో నిర్మించనున్నారు. రూ.172 కోట్లతో జీ+4 అంతస్తులతో దీన్ని నిర్మిస్తారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతో కలిసి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. జీ+4లోని మొదటి రెండు అంతస్తుల్లో 62 దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. మూడో అంతస్తు నుంచి సముద్రాన్ని వీక్షించేలా (సీ వ్యూ) ఏర్పాటు ఉంటుంది. నాలుగో అంతస్తులో కన్వెన్షన్‌ హాల్, రెండు మినీ థియేటర్లు ఉంటాయి. రిటైల్‌ స్టోర్లు, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ ఔట్‌లెట్లు, వినోద సదుపాయాలు, ఫిట్‌నెస్‌ సెంటర్లు, బ్యాంకు శాఖలు, ఫర్నిచర్‌ స్టోర్లు కూడా వస్తాయి.
Visakhapatnam
Unity Mall at Vizag
Modi to Foundation Stone on May 2
Madurawada
యూనిటీ మాల్‌ను విశాఖలోని మధురవాడ
172 కోట్లతో జీ+4 అంతస్తు
ప్రధాని మోదీ
సీఎం చంద్రబాబుతో కలిసి వర్చువల్‌గా శంకుస్థాపన
Scroll for the next article