National13th Jun 11:04 AMSunil Byrisetty1 min read
విమాన బాధితులను పరామర్శించిన ప్రధాని
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆయన అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో పరామర్శిస్తున్నార
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆయన అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో పరామర్శిస్తున్నారు. అలాగే విమానం కూలిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించనున్నారు. ప్రధానితో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఆయనతో ఉన్నారు. కాగా, ఇప్పటికే ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.