News27th Oct 10:15 AMSunil Byrisetty1 min read

పీఎం కిసాన్ నిధులు ఎప్పుడంటే!

దేశవ్యాప్తంగా రైతులకు అండగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అమలవుతోంది. దీని కింద అర్హత కలిగిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్న

పీఎం కిసాన్ నిధులు ఎప్పుడంటే!
దేశవ్యాప్తంగా రైతులకు అండగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అమలవుతోంది. దీని కింద అర్హత కలిగిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి 21వ విడతను విడుదల చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నవంబర్ మొదటి వారంలో ఈ నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం. e-KYC పూర్తి చేసుకుని, ఆధార్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన వారికే డబ్బులు జమ కానున్నాయి.
Rural India
PM Kisan
Farmers Welfare
Government Schemes
Agriculture
PM Kisan Installment
eKYC
Aadhaar Link
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
రైతుల సంక్షేమం
వ్యవసాయ పథకాలు
ప్రభుత్వ పథకాలు
Scroll for the next article