Mobiles13th Dec 12:38 PMSunil Byrisetty2 min read
పోకో బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ ఫోన్
షియోమీ సబ్ బ్రాండ్ పోకో సి85 5జి పేరిట కొత్త ఫోన్ లాంచ్ చేసింది. 6.9 ఇంచుల డిస్‌ప్లే హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు ముందు వ
షియోమీ సబ్ బ్రాండ్ పోకో సి85 5జి పేరిట కొత్త ఫోన్ లాంచ్ చేసింది. 6.9 ఇంచుల డిస్‌ప్లే హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా నాచ్‌లో అమర్చబడి ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో మీడియాటెక్‌కు చెందిన డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత షియోమీ హైపర్ ఓఎస్2ను అందిస్తున్నారు. 2 ఏళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, మరో సెకండరీ కెమెరా, పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి. 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ 10 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్‌కు సైతం సపోర్ట్‌ను అందిస్తుంది. అందువల్ల ఈ ఫోన్ సహాయంతో ఇతర ఫోన్లను సైతం చార్జింగ్ చేసుకోవచ్చు. మెమెరీని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. డ్యుయల్ సిమ్‌లతోపాటు మైక్రో ఎస్‌డీ కార్డును సైతం ఏకకాలంలో వేసుకోవచ్చు. ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను సైతం అందిస్తున్నారు. పోకో సి85 5జి స్మార్ట్ ఫోన్‌ను మిస్టిక్ పర్పుల్, స్ప్రింగ్ గ్రీన్, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.12,999, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ ధర రూ.14,499గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 16 నుంచి విక్రయించనున్నారు.