National20th Aug 11:48 AMSunil Byrisetty1 min read
పోక్సో చట్టానికి ఎవరైనా ఒకటే..
పోక్సో చట్టానికి ఎవరైనా ఒకటేనని కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పింది. కర్ణాటకలో 13 ఏళ్ల బాలుడిపై
పోక్సో చట్టానికి ఎవరైనా ఒకటేనని కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పింది.
కర్ణాటకలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ 48 ఏళ్ల ఉపాధ్యాయురాలిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టును మహిళ ఆశ్రయించారు. ఈ కేసు విచారిస్తూ పోక్సో చట్టానికి లింగ వివక్ష ఉండదని, నేరం చేసింది పురుషులైనా, మహిళలైనా సమాన శిక్ష అనుభవించాల్సిందేనని కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎం.నాగప్రసన్న స్పష్టం చేశారు. దేశంలో లైంగిక వేధింపులకు గురవుతున్న వారిలో 54.4% బాలురు, 46.6% బాలికలు ఉంటున్నారని పేర్కొన్నారు. తగిన ఆధారాలు సేకరించి నిందితురాలికి వెంటనే శిక్ష విధించాలని ట్రయల్ కోర్టును కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.