News2nd Sep 12:51 PMSunil Byrisetty1 min read
ఆ కుటుంబాలకు మోడల్ కాలనీ!
పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ నివాసాలు ఏర్పాటు చేస్తోంది. పోలవరం పనుల్లో అత్యంత సంక్లిష్టమైన వాటిని ఇంజనీర్లు పూర్తి చేశారు. 123, 11
పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ నివాసాలు ఏర్పాటు చేస్తోంది. పోలవరం పనుల్లో అత్యంత సంక్లిష్టమైన వాటిని ఇంజనీర్లు పూర్తి చేశారు. 123, 115 మీటర్ల ఎత్తైన రెండు కొండలను బ్లాస్టింగ్ చేసి మరీ కాలువ తవ్వారు. ఈ క్రమంలో 472 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. వారిని 3 కి.మీ దూరంలోని దుగ్గిలోవ, చేపూరు గ్రామాలకు తరలించి పునరావాసం కల్పిస్తున్నారు. నిర్వాసితుల కోసం రూ.14.71 కోట్లతో అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ఇళ్లు కట్టించారు. దీంతో ఆయా కుటుంబాలు కొత్తిళ్లకు మారుతున్నాయి.