News19th Sep 01:36 PMSunil Byrisetty1 min read

పోలవరం పునరావాసంపై మంత్రి నిమ్మల

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా 373 నివాస ప్రాంతాల్లో 96,660 కుటుంబాలను తరలించాల్సి ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా 41.

పోలవరం పునరావాసంపై మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా 373 నివాస ప్రాంతాల్లో 96,660 కుటుంబాలను తరలించాల్సి ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా 41.15 మీటర్ల కాంటూరు వరకు 38,060 కుటుంబాలకు, 45.72 మీ కాంటూరు పరిధిలో 58,600 కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని చెప్పారు. 41.15 మీ కాంటూరు పరిధిలో 19,953 కుటుంబాలకు పరిహారం అందించామన్నారు. ఫేజ్-1 కింద 18, 964 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించామని తెలిపారు. 19, 953 నిర్వాసిత కుటుంబాలకు 1212 కోట్లు పరిహారం అందించామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం మొత్తం 2973 మంది సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ కోసం 1517 మంది లష్కర్లు, 1456 మంది హెల్పర్లు, ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు వంటి సిబ్బంది పనిచేస్తున్నారని నిమ్మల పేర్కొన్నారు.
Andhra Pradesh
Polavaram
Rehabilitation
Nimmala Ramanaidu
Water Resources
Resettlement
Displaced Families
పోలవరం ప్రాజెక్ట్ పునరావాస
మౌలిక సదుపాయాలు
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి
Scroll for the next article