News15th Jul 03:46 PMSunil Byrisetty1 min read
2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి
పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తరలించటం వల్లే శ్రీశైలంలో ఆ నీటిని పొదుపు చేసుకోగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జలహారతి ఇచ్చిన ఆయన మా
పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తరలించటం వల్లే శ్రీశైలంలో ఆ నీటిని పొదుపు చేసుకోగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జలహారతి ఇచ్చిన ఆయన మాట్లాడుతూ రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూ.24 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 37 సార్లు నేరుగా సందర్శించానని గుర్తు చేశారు. 136 సార్లు సమీక్షించానని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు 89 శాతం మేర పూర్తి చేశామని, ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.2,250 కోట్లు చెల్లించామని వివరించారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రానికి జీవనాడిగా మారుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.