Politics5th Mar 03:32 PMSunil Byrisetty1 min read

పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై పచ్చి అబద్దాలు: షర్మిల

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి పచ్చి అబద్ధాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు. మసి పూసి మారేడు కాయ చేసినట్లు నిజ

పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై పచ్చి అబద్దాలు: షర్మిల
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి పచ్చి అబద్ధాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు. మసి పూసి మారేడు కాయ చేసినట్లు నిజాలను దాచి పెడుతున్నారన్నారు. రాష్ట్ర జీవనాడి అయిన ప్రాజెక్టులో జీవం తీసేశారన్నారు. ఎత్తు తగ్గించి 194 TMCల నీటి నిల్వ సామర్థ్యం నుంచి 114 TMCలకు పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని, 22 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణకు, 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు.. సాగునీరు అందించే మహానేత YSR నిర్ధేశిత లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని YSR అనుకుంటే.. 41.15 మీటర్ల ఎత్తుకు కుదించి పోలవరంను మినీ రిజర్వాయర్‌గా మార్చుతున్నారని విమర్శలు చేశారు. నీటి నిల్వకు తప్పా ఎందుకు పనికి రాని ప్రాజెక్టుగా చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు అయితే, ఎత్తు తగ్గింపు విషయం అవాస్తవం అయితే, కేంద్ర ప్రభుత్వంతో వెంటనే అధికారిక ప్రకటన చేయించాలని కాంగ్రెస్ తరఫున షర్మిల డిమాండ్ చేశారు.
YS Sharmila
Polavaram Project
వైఎస్ షర్మిల
పోలవరం ప్రాజెక్ట్
Scroll for the next article