News7th Aug 03:39 PMSunil Byrisetty1 min read
పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి
2014 సంవత్సరంలో పార్లమెంటులో ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా అంగీకరించడం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, న
2014 సంవత్సరంలో పార్లమెంటులో ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా అంగీకరించడం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, నేతలు తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని 8 మండలాలలోని 392 గ్రామాలకు చెందిన 1,06,000 కుటుంబాలు సర్వం కోల్పోతున్నారని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చొరవ చూపించడం లేదన్నారు. నిర్వాసితుల సమస్యలు తీవ్రంగాను, దయనీయంగా ఉన్నాయన్నారు. నిర్వాసిత గ్రామాల పేరుతో నిర్మించిన కాలనీలు 2022 వరదలకు మునిగిపోయాయన్నారు. ఒకే గ్రామంలో రోడ్డుకు ఒకవైపు మునక, మరోవైపు మెరకగా నిర్ధారించారని వివరించారు. అందువల్ల తప్పు లెక్కలు ప్రక్కన పెట్టి 1986, 2022 వరదల ఆధారంగా పునరావాసానికి చర్యలు తీసుకోవాలని కోరారు.