News8th Oct 02:36 PMSunil Byrisetty1 min read

పోలవరంతో జలరవాణాకు మార్గం సుగమం

పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును

పోలవరంతో జలరవాణాకు మార్గం సుగమం
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మార్చడంతో పాటు డయాఫ్రమ్ వాల్‌ను విధ్వంశం చేసిందని మంత్రి నిమ్మల విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులను వేగవంతం చేసిందన్నారు. ప్రస్తుతం పోలవరం సివిల్ పనులు 88 శాతం, భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనులు ఆర్థికంగా 64 శాతం, మొత్తంగా ప్రాజెక్టు భౌతిక పురోగతి 83 శాతం, ఆర్థిక పురోగతి 78 శాతంకు చేరిందని మంత్రి నిమ్మల తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి జలశక్తి మంత్రి పాటిల్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2019కు ముందు ఫేజ్–1, ఫేజ్–2 అనే విభజన లేదని మంత్రి తెలిపారు. భద్రాచలం నుంచి రాజమండ్రి, కాకినాడ వరకు జాతీయ జలమార్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. 2009లో క్లాస్–3గా నోటిఫై చేసిన ఈ జలమార్గాన్ని కొనసాగిస్తూ విస్తరించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
Scroll for the next article