Politics23rd Oct 04:01 PMSunil Byrisetty1 min read

విడదల రజినిని తోసిపడేసిన పోలీసులు

చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద పోలీసులు హల్ చల్ చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో, రజినిని కలవడానికి యడ్లపాడు

విడదల రజినిని తోసిపడేసిన పోలీసులు
చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద పోలీసులు హల్ చల్ చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో, రజినిని కలవడానికి యడ్లపాడు ZPTC అభ్యర్థి దళిత నాయకుడు పందుల బుల్లబ్బాయిని పోలీసులు నివాసం గేటు వద్దే అడ్డుకున్నారు. తన నివాసంలోకి వస్తున్న తన వాళ్లను ఎందుకు అడ్డుకుంటున్నారని రజిని ప్రశ్నించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి విడదల రజినిని చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంక గట్టిగా తోశారు. ఒక మాజీ మంత్రి పట్ల, తన సొంత నివాసం వద్దే పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Scroll for the next article