News4th Jul 09:39 AMSunil Byrisetty1 min read

వైద్య విద్యార్థులపై దాడి దారుణం: బొత్స

విజయవాడలో డాక్టర్ చదువులు చదువుకున్న వారిపై పోలీసుల దాడి అత్యంత దారుణమని మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యార్థినులపైనా భౌతిక దాడులు చేయడం అన్యా

వైద్య విద్యార్థులపై దాడి దారుణం: బొత్స
విజయవాడలో డాక్టర్ చదువులు చదువుకున్న వారిపై పోలీసుల దాడి అత్యంత దారుణమని మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యార్థినులపైనా భౌతిక దాడులు చేయడం అన్యాయమన్నారు. విదేశాల్లో చదువుకున్న మెడికల్‌ గ్రాడ్యుయేట్ల విషయంలో ప్రభుత్వం కిరాతకంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లను నేరస్తుల మాదిరిగా చూస్తోందన్నారు. అన్ని అర్హతలున్న వారికి పీఆర్‌ నంబర్‌ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. లక్షలు ఖర్చు చేసి చదివించుకున్న వారి తల్లిదండ్రులకు శోకం ఎందుకు తెప్పిస్తోందని అడిగారు. ఇంత చదివి.. రోడ్డు మీద పోరాటాలు చేయాల్సిన పరిస్థితిని సీఎం చంద్రబాబు తీసుకురావడం శోచనీయమని పేర్కొన్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే వారి పోరాటాల్లో భాగస్వాములు అవుతామని బొత్స హెచ్చరించారు.
Andhra Pradesh news
Botsa satyanarayana
Police Attack
NTR Health University
Foreign Medical Students
వైద్య విద్యార్థులపై దాడి దారుణం
Scroll for the next article