News5th Nov 11:53 AMSunil Byrisetty1 min read
సెల్ఫ్ డిఫెన్స్, శక్తి యాప్ పై పోలీసుల అవగాహన
మహిళలు, బాలికల రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాలను గురించి మహిళలకు, విధ్యార్ధులకు శక్తి యాప్, 112 (అత్యవసర సేవలు), 1930 (సైబర్ మోసాల నివేదికల కోసం), 1098 (బాలల హెల్ప్‌లైన్),
మహిళలు, బాలికల రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాలను గురించి మహిళలకు, విధ్యార్ధులకు శక్తి యాప్, 112 (అత్యవసర సేవలు), 1930 (సైబర్ మోసాల నివేదికల కోసం), 1098 (బాలల హెల్ప్‌లైన్), 181 (మహిళల హెల్ప్‌లైన్), 1073 (ట్రాఫిక్ సమాచారం కోసం), 101 (ఫైర్ ఎమర్జెన్సీ) వంటి కీలకమైన టోల్-ఫ్రీ నెంబర్ లపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా ఆపద సమయాలలో ప్రజలకు మేము ఉన్నాం అనే భరోసా కల్పించాలనే సదుద్దేశంతో నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు కార్యక్రమాలు చేపట్టారు. అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత, మహిళా పోలీసు స్టేషన్ ఎ.సి.పి. టి.దైవ ప్రసాద్ పర్యవేక్షణలో వివిధ ప్రదేశాలలో మహిళలకు, స్కూల్స్, కళాశాలలలో బాలికలకు వారి రక్షణకు కల్పించబడిన మహిళా చట్టాల గురించి శక్తి యాప్ వలన కలిగే ఉపయోగాలు గురించి వివరిస్తున్నారు. శక్తి టీం బృంధాలు నగరంలోని వివిద స్కూల్స్ లలో విద్యార్థులకు ఆపద సమయాలలో ఏ విధంగా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి, శక్తి యాప్ అనేది అక్రమార్కుల పాలిట ఆయుధంగా మారుతుందని, మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలకు యువతులకు శక్తి యాప్ వలన ఉపయోగాలను తెలియజేశారు. వారి ఫోన్ లలో శక్తి యాప్ లను డౌన్ లోడ్ చేయించడం, మరియు సోషల్ మీడియా, సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి, చిన్నపిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే విషయాల గురించి, నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు POCSO యాక్ట్ గురించి, డయల్ 112 మొదలగు అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.