News11th Oct 12:50 PMSunil Byrisetty1 min read

డాగ్ కెనాల్స్ ప్రారంభించిన పోలీస్ కమీషనర్

ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రముఖులు, వి.వి.ఐ.పి.లు, ముఖ్య వ్యక్తులు విచ్చేసే సమయంలో వారి భద్రత విషయంలో, వివిధ బందోబస్తులలో, నార్కోటిక్స్, నేర పరిశోధనలలో, ప్రముఖుల

డాగ్ కెనాల్స్ ప్రారంభించిన పోలీస్ కమీషనర్
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రముఖులు, వి.వి.ఐ.పి.లు, ముఖ్య వ్యక్తులు విచ్చేసే సమయంలో వారి భద్రత విషయంలో, వివిధ బందోబస్తులలో, నార్కోటిక్స్, నేర పరిశోధనలలో, ప్రముఖుల పర్యటనలలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యలలో బాగంగా ఎక్సప్లోజివ్స్ లను గుర్తించేందుకు తనిఖీలను నిర్వహించేందుకు శిక్షణ ఇచ్చిన డాగ్ లను ఉపయోగిస్తారు. వాటికోసం ఆగస్టు నెలలో సిటీ ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్ సమీపంలోని డాగ్స్ కెనాల్ వద్ద డాగ్ కెనాల్స్ లను నిర్మించడానికి భూమి పూజ నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఈ రోజు నూతనంగా నిర్మించిన సదరు డాగ్ కెనాల్ లను నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో ముందుగా శిక్షణ తీసుకున్న పోలీసు డాగ్స్ పోలీసు కమిషనర్ కి స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం శిక్షణ తీసుకున్న డాగ్స్ వాటి మెళుకువలను పోలీసు అధికారుల ముందు ప్రదర్శన చేశాయి.
Andhra Pradesh Police
Canine Unit
NTR District
Police Commissioner
Dog Kennels
Police Dogs
Security Forces
Explosives Detection
VIP Security
ఎస్.వి. రాజశేఖర బాబు
పోలీస్ శిక్షణ
Scroll for the next article