News5th Sep 12:35 PMSunil Byrisetty1 min read

ఆ 4 నగరాల్లో పోలీస్ కమిషనరేట్లు!

రాష్ట్రంలో కొత్త పోలీస్ కమిషనర్లు కొలువుదీరనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడలో మాత్రమే కమిషనరేట్లు ఉన్నాయి. ఇకపై రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో పోలీ

ఆ 4 నగరాల్లో పోలీస్ కమిషనరేట్లు!
రాష్ట్రంలో కొత్త పోలీస్ కమిషనర్లు కొలువుదీరనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడలో మాత్రమే కమిషనరేట్లు ఉన్నాయి. ఇకపై రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇవి ఆమోదం పొందితే మొత్తం 6 కమిషనరేట్లు అవుతాయి. కమిషనరేట్లుగా అయిన నగరాల్లో సీనియర్ ఐపీఎస్ లను కమిషనర్లుగా నియమిస్తారు. దీనివల్ల సైబర్ నేరాల కట్టడి, సీసీ కెమెరాల నెట్వర్క్, ట్రాఫిక్ శాంతిభద్రతల విభాగాల మధ్య సమన్వయం మెరుగుపడుతుందని, ప్రజలకు మెరుగైన భద్రత అందుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే కమిషనర్లకు జిల్లా ఎస్పీల కన్నా ప్రత్యేక అధికారాలు ఉంటాయి. తద్వారా నేరాల నియంత్రణ, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి అవకాశాలు లభిస్తాయి.
Andhra Pradesh Police
Police Commissionerates
AP Police
Visakhapatnam Police
Vijayawada Police
Guntur Police
Tirupati Police
ఐపీఎస్ అధికారులు
సైబర్ నేరాలు
ట్రాఫిక్ నిర్వహణ
సీసీ కెమెరాలు
శాంతిభద్రతలు
ఏపీ ప్రభుత్వం
Scroll for the next article