News11th Apr 03:03 PMSunil Byrisetty1 min read
పవన్ చిన్న కుమారుడిపై అసభ్యకర పోస్ట్‌లు.. కేసులు నమోదు!
సింగపూర్లో ఓ అగ్నిప్రమాదంలో గాయపడిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌పై అసభ్యకర పోస్టులు వేయడంపై కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ
సింగపూర్లో ఓ అగ్నిప్రమాదంలో గాయపడిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌పై అసభ్యకర పోస్టులు వేయడంపై కేసులు నమోదయ్యాయి.
ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేయంతో ఇంటికి వచ్చేశాడని చిరంజీవి ట్వీట్ కూడా చేశారు.
అయితే కొందరు 'ఎక్స్'లో మార్క్ శంకర్‌పై అసభ్యకర ట్వీట్‌లు చేశారు.
దీనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు
త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
ఇదే అంశంపై విజయవాడలోనూ కేసు నమోదైనట్లు చెప్పారు.
మహిళలు, చిన్నారులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, వ్యక్తిత్వ దూషణకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ఒక జనసేన కార్యకర్త ఈ అసభ్యకరమైన ట్వీట్ అంశాన్ని హోంమంత్రి వంగలపూడి అనితకు ఫిర్యాదు చేశారు.