News2nd Nov 05:00 PMSunil Byrisetty1 min read

రాప్తాడు నిందితుడిపై కాల్పులు.. హైకోర్టులో పిల్!

రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్‌ అలియాస్‌ దుమ్ముపై పోలీసుల కాల్పులు, అతడిని ఆస్పత్రికి తరలించిన తీరుపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్‌)

రాప్తాడు నిందితుడిపై కాల్పులు.. హైకోర్టులో పిల్!
రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్‌ అలియాస్‌ దుమ్ముపై పోలీసుల కాల్పులు, అతడిని ఆస్పత్రికి తరలించిన తీరుపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్‌) దాఖలైంది. న్యాయవాది గుండా గోపీ కృష్ణ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. హేమంత్‌ ఆత్మకూరు అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని, అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు బృందంపై నిందితుడు దాడి చేశాడని, ఆ దాడిలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు గాయాలయ్యాయని మీడియా కథనాల ఆధారంగా పిటిషనర్‌ వివరించారు. పోలీసుల అధికారిక వివరణ ప్రకారం మొదట గాల్లోకి కాల్పులు జరిపి, అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడైందని పేర్కొన్నారు. కాల్పుల సమయంలో పోలీసుల చర్యలు చట్టపరమైన పరిమితులకు, అవసరమైన అనుపాతానికి అనుగుణంగా ఉన్నాయా? అనే అంశాలపై స్వతంత్ర విచారణ జరగాలని పిటిషనర్‌ కోరారు.
Scroll for the next article