National20th Jul 12:02 PMSunil Byrisetty1 min read

బొద్దింకలపై పోలీస్ లాఠీచార్జ్

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. లోక్ సభ వరకు మార్చ్ చేయడానికి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాక్రోచ్ కార్యకర్తల

బొద్దింకలపై పోలీస్ లాఠీచార్జ్
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. లోక్ సభ వరకు మార్చ్ చేయడానికి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాక్రోచ్ కార్యకర్తలు బారికేడ్లను దాటుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు, ప్రత్యేక బలగాలు సీజేపీ నిరసన కారులను అడ్డుకున్నారు. ఒక్కసారిగా వాగ్వాదం చెలరేగి తోపులాటకు దారి తీసింది. వెంటనే పోలీసులు, ప్రత్యేక బలగాలు నిరసన కారులను అదుపు చేసేందుకు వారిపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
India news
Delhi
Chalo Sansad
Cockroach Janata Party
Jantar Mantar
Delhi Police
లాఠీచార్జ్
నిరసన
పార్లమెంట్
భారత వార్తలు
Scroll for the next article