News29th Sep 03:53 PMSunil Byrisetty1 min read

మహిళా మావోయిస్టు సహా ముగ్గురి ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. ఒక మహిళా మావోయిస్టు సహా ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. కాంకేర్‌, గరియాబంద్‌ జిల్లాల సరిహద్దులోని చిండ్‌ఖ

మహిళా మావోయిస్టు సహా ముగ్గురి ఎన్‌కౌంటర్‌
ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. ఒక మహిళా మావోయిస్టు సహా ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. కాంకేర్‌, గరియాబంద్‌ జిల్లాల సరిహద్దులోని చిండ్‌ఖడక్‌ గ్రామ సమీప కొండలపై మావోయిస్టులు ఉన్నారని కాంకేర్‌ ఎస్పీ ఇందిరా కల్యాణ్‌కు సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌(డీఆర్‌జీ), సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్‌), కోబ్రా, ఎస్టీఎఫ్‌ బలగాలను ఆ కొండ వద్దకు పంపించారు. వీరికి మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయి. మృతులను సీతానది ఏరియా కమిటీ కార్యదర్శి సర్వన్‌ మడ్కం అలియాస్‌ విశ్వనాథ్‌, నగిరి ఏరియా కమిటీ సభ్యుడు రాజేశ్‌ అలియాస్‌ రాకేశ్‌ హేమ్లా, మెయిన్‌పూర్‌-నువాపాడ రక్షణ బృందం సభ్యురాలు బసంతి కుంజాం అలియాస్‌ హిడ్మేగా గుర్తించారు. ఘటనా స్థలంలో పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులు ముగ్గురిపై మొత్తంగా రూ.14 లక్షల రివార్డు ఉందని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందరరాజ్‌ చెప్పారు.
Chhattisgarh Encounter
Maoists Killed
Security Forces
DRG
BSF
CoBRA
STF
Bastar Range
Kanker District
Gariaband District
Naxalites
Maoist Reward
మహిళా మావోయిస్టు సహా ముగ్గురి ఎన్‌కౌంటర్‌
Scroll for the next article