News1st Sep 05:16 PMSunil Byrisetty1 min read
పల్లె నిద్రతో ప్రజలతో పోలీసులు
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జిల్లా పోలీసు శాఖ చేపట్టిన మెగా పల్లె నిద్ర కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 830 గ్రామాల్లో పోలీసు అధికారుల
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జిల్లా పోలీసు శాఖ చేపట్టిన మెగా పల్లె నిద్ర కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 830 గ్రామాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది రాత్రి బస చేశారు. హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేలా కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి తెలిపారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో బస చేయడం ద్వారా పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. ప్రజల్లో భద్రతా భరోసాను పెంపొందించడమే పల్లె నిద్ర ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా గార మండలం కళింగపట్నం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లె నిద్రలో భాగంగా గ్రామస్థులతో పోలీసు అధికారులు సమావేశమై శాంతిభద్రతలు, మహిళలు, బాలల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, రహదారి భద్రత, ఆస్తి నేరాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామస్థుల నుంచి స్థానిక సమస్యలు, సీసీ కెమెరాల ఏర్పాటుకి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.