News17th Jun 01:30 PMSunil Byrisetty1 min read

హవాలాకు అడ్డాగా నెల్లూరు జిల్లా.. 3 రోజుల్లో రూ.7 కోట్లు!

నెల్లూరు జిల్లాలో హవాలా వ్యవహారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 3 రోజుల వ్యవధిలో 2 చోట్ల భారీగా నగదు దొరకడం కలకలం రేపింది. జిల్లాలోని మర్రిపాడు మండలంలో 2 వేర్వేరు ప్రాంతాల్లో 2 కార్

హవాలాకు అడ్డాగా నెల్లూరు జిల్లా.. 3 రోజుల్లో రూ.7 కోట్లు!
నెల్లూరు జిల్లాలో హవాలా వ్యవహారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 3 రోజుల వ్యవధిలో 2 చోట్ల భారీగా నగదు దొరకడం కలకలం రేపింది. జిల్లాలోని మర్రిపాడు మండలంలో 2 వేర్వేరు ప్రాంతాల్లో 2 కార్లలో సుమారు రూ.7 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రిజిస్ట్రేషన్లతో ఉన్న 2 కార్ల నుంచి ఈ సొమ్మును పోలీసులు పట్టుకున్నారు. ఈ 2 కార్లలో నగదును చెన్నై తరలిస్తున్నట్లు తేలింది. ఈ 2 కార్లు ఒకరివేనా లేదా వేర్వేరు వ్యక్తులవా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో శనివారం రాత్రి డబ్బును లెక్కించి ఎస్పీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.
Andhra Pradesh news
Nellore district
havala money
7 crore cash seized
police seize amount
marripadu mandal
నెల్లూరులో భారీగా నగదు తరలింపు
Scroll for the next article