Telangana26th Nov 11:44 AMSunil Byrisetty1 min read
పోలీస్ తుపాకీ తాకట్టు.. ఎస్సై అరెస్ట్
హైదరాబాద్‌లో ఓ ఎస్సై ఏకంగా తన తుపాకీని తాకట్టు పెట్టి బెట్టింగ్ ఆడాడు. విషయం బయటపడటంతో పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. బెట్టింగ్ వ్యసనంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీ
హైదరాబాద్‌లో ఓ ఎస్సై ఏకంగా తన తుపాకీని తాకట్టు పెట్టి బెట్టింగ్ ఆడాడు. విషయం బయటపడటంతో పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. బెట్టింగ్ వ్యసనంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్ తుపాకీతో పాటు, కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై భాను ప్రకాశ్ పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా చేశాడు. ఓ రికవరీ కేసులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఐదు తులాల బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. భాను ప్రకాశ్ వద్ద ఉండాల్సిన సర్వీస్ గన్ కనిపించకపోవడంతో ఉన్నతాధికారులు నిలదీయగా సరైన సమాధానం రాలేదు. విచారించగా, బంగారంతో పాటే తుపాకీని కూడా ఓ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సై భాను ప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.