News23rd Sep 01:58 PMSunil Byrisetty1 min read
దివ్యాంగులకు, వృద్ధులకు "సేవాదళ్" బృందం చేయూత
దుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు పోలీసు సేవాదళ్ బృందాలు చక్కటి సేవలందిస్తున్నాయి. పదిమంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ బృందాలు వేకువ జాము నుంచి రాత్రి దర్శనం పూర్
దుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు పోలీసు సేవాదళ్ బృందాలు చక్కటి సేవలందిస్తున్నాయి. పదిమంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ బృందాలు వేకువ జాము నుంచి రాత్రి దర్శనం పూర్తయ్యే వరకు దివ్యాంగులు, వృద్ధులు దర్శనం చేసుకోవడంలో సాయం చేస్తూ భక్తుల ప్రశంసలు పొందుతున్నాయి. నవరాత్రులలో రెండవ రోజైన మంగళవారం గాయత్రీ దేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని సేవించుకోవడానికి సత్తుపల్లి నుంచి ఎం. రజని అనే దివ్యాంగురాలు తన భర్త కృష్ణయ్యతో కలసి విజయవాడకు వచ్చారు. వృద్ధుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులో ఇంద్రకీలాద్రి పైకి చేరుకోగా, అక్కడి నుంచి చక్రాల కుర్చీలో సేవాదళ్ సభ్యులు ఆమెను దర్శనానికి తీసుకువెళ్లారు. పోలీస్ ఏఆర్ విభాగానికి చెందిన ముగ్గురు మహిళా సేవాదళ్ సభ్యులు తనకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారని, వారికి, పోలీస్ శాఖకు, దేవస్థానానికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని కృష్ణయ్య-రజనీ దంపతులు చెప్పారు.