News8th Apr 09:28 AMSunil Byrisetty1 min read
వాట్సాప్ గ్రూపులపై పోలీస్ నిఘా..?
తెలంగాణ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం గురించి, పనితనం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి వాట్సప్ గ్రూపుల్లో చేరుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎ
తెలంగాణ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వం గురించి, పనితనం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి వాట్సప్ గ్రూపుల్లో చేరుతున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరెవరు పోస్టులు పెడుతున్నారో తెలుసుకుని, వాళ్లను కట్టడి చేయడం ఎలా అనే అంశంపై సమీక్షలు చేస్తున్నారు.
ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో నిఘా వ్యవస్థ రంగంలోకి దిగినట్టు తెలిసింది.
గ్రామాల నుంచి, మండలం, జిల్లా స్థాయి వరకు వాట్సప్ గ్రూపుల్లో మన సిబ్బంది చేరి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. దీంతో కిందిస్థాయి హోంగార్డు, కానిస్టేబుళ్లు వాట్సప్ గ్రూపుల వేటలో పడ్డారు.
గ్రామాల నుంచి ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వస్తే.. ‘మీ గ్రామంలో ఎన్ని వాట్సప్ గ్రూపులు ఉండొచ్చు.
పార్టీల గ్రూపులు, ఊరి అభివృద్ధి గ్రూపులు, కులాల వారీగా, మతాల వారీగా, యూత్ గ్రూప్‌లు, ఇంటి పేర్లతో ఉన్న గ్రూపుల్లో మమ్మల్ని కూడా యాడ్ చేయండి’ అంటూ పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారట.
తెలంగాణలో 13వేల పైచిలుకు గ్రామాలు ఉన్నాయి.
వీటిల్లో కనీసం 3 లక్షల గ్రూపులు ఉండొచ్చని అంచనా.
ఆ గ్రూపుల్లోని సమాచారం తెలుసుకునేలా ప్రత్యేకంగా ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.